కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం* **చెక్కుల పంపిణీ* *కార్యక్రమం** జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ తహసిల్దార్ రాజ్ కుమార్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ గారులతో సమావేశం ఏర్పాటు చేయనైనది.

ప్రెస్ రిలీజ్
28.01.2023.
*కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం* **చెక్కుల పంపిణీ* *కార్యక్రమం** జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ తహసిల్దార్ రాజ్ కుమార్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ గారులతో సమావేశం ఏర్పాటు చేయనైనది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో హనుమకొండ లో 1100 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ హాస్పిటల్ నిర్మాణం పనులు పరిశీలించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు వచ్చారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద ఆర్ధికంగా వెనుకబడిన ప్రతి కుటుంబంలోని ఆడపిల్ల వివాహానికి రూ/-100116=00. ఒక లక్ష్య నూట పదహారు రూపాయలు అందించడం జరుగుతుంది.మరియు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష చేసి,ఉచితంగా అద్దాలను అందజేయడం జరుగుతుంది.కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవరైనా అనారోగ్యంతో వున్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద హాస్పిటల్ లో అయిన ఖర్చు లో 90 శాతం వరకు ఇప్పించడం జరుగుతుంది అన్నారు.అనంతరం 200 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపినీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి శ్రీనివాస్, కార్పొరేటర్ చెన్నం మధు తదితర కార్పొరేటర్లు,లబ్ది దారులు పాల్గొన్నారు.

Share This Post