కళ్యాణ లక్ష్మీ/షాదిముబారక్ పథకం పేదింటి ఆడపడుచు పెండ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నదని, కళ్యాణ లక్ష్మీ/పాదిముబారక్ క్రింద ఖమ్మం నియోజకవర్గంలో నేటి వరకు 5682 వేల మంది లబ్ధిదారులకు 50.83 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 15,ఖమ్మం :

కళ్యాణ లక్ష్మీ/షాదిముబారక్ పథకం పేదింటి ఆడపడుచు పెండ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నదని, కళ్యాణ లక్ష్మీ/పాదిముబారక్ క్రింద ఖమ్మం నియోజకవర్గంలో నేటి వరకు 5682 వేల మంది లబ్ధిదారులకు 50.83 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ తెలిపారు. బుధవారం రఘునాథపాలెం రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33 మంది లబ్ధిదారులకు రూ.33, లక్షల కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను మంత్రి. అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 1348 మంది లబ్ధిదారులకు రూ.1.8 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు. పేద నిరుపేదలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం అన్నారు. పెద నిరుపేద కుటుంబాల ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే సంకల్పంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలోచన చేసి కళ్యాణ లక్ష్మి/పాది ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

అనంతరం మండల పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు గుర్తించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు.

కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, జడ్పీటిసి మాలోతు ప్రియాంక, ఎం.పి.పి. మాలోతు గౌరీ, తహశీల్దారు నర్సింహారావు, ఎం.పి.డి.ఓ రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post