కవులు, కళాకారులు, సాహితివేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్

కవులు, కళాకారులు, సాహితివేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్

 

కవులు,కళాకారులు,సాహితీవేత్తల కోసం   త్వరలో భవన నిర్మాణం

 

జిల్లా అన్ని  రంగాల్లో అభివృద్ధి

 

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

 

రాష్ట్ర బీసీ పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్

 

000000

 

 

     కవులు, కళాకారులు మరియు సాహితివేత్తలకు పుట్టినిళ్లయిన కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచేలా జిల్లాలో వారికోసం వేదిక( భవనాన్ని) నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కోన్నారు.

 

    బుధవారం తెలుగునామ సంవత్సర శోభకృత్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శోభకృత్ ఉగాది కవిసమ్మేళనం, పంచాంగ శ్రవణం, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.  మొదటగా జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పలువురు వారి కవిత సంపుటులను వినిపించగా తదనంతరం పురాణం మహేశ్వర శర్మ  పంచాంగ శ్రవణాన్ని గావించి రాశి ఫలాలను గురించి వివరించారు.  అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ,  కవులు, కళాకారులు మరియు సాహితివేత్తలకు పుట్టినిళ్లయిన కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచేలా జిల్లాలో ఆవులు కళాకారులు సాహితీవేత్తల కోసం అద్భుతమైన కళాఖండం వేదిక భవనాన్ని నిర్మించనున్నట్లు పేర్కోన్నారు.  ఒ వైపు మానేరురివర్ ఫ్రంట్, మరోవైపు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మెడికల్ కళాశాల, అద్బుతమైన రోడ్ల నిర్మాణాలతో రానున్న రోజులలో హైదరాబాద్ తరువాత మరో అద్బుత నగరంగా కరీంనగర్ జిల్లా వెలుగొందాలని అన్నారు.  ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఈ శోభకృత్ నామ సంవత్సరం  బాగుండాలని,  అద్బుతమైన పాడిపంటలతో, ఆత్మహత్యలు లేని మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు.   సమాజంలో దైవభక్తి ప్రదానమని, దానిని పెంపోందించేలా దైవిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని,  కరోనా లాంటి విపత్కర పరీస్థీతులను ఎదుర్కొన్నామని, అలాంటి రోజులు రాకూడదని అన్నారు.

 

     అంతకుముందు పురాణం మహేశ్వర శర్మ పంచాంగ పఠనం గావించారు. ఈ సందర్భంగా వారు పంచాంగ శ్రావణం చేస్తూ శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, వర్షాలు సకాలంలో పడతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని దేశం అభివృద్ధి లో ఉంటుందన్నారు.

 

     అనంతరం కవి సమ్మేళనం లో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, వైరాగ్యం ప్రభాకర్, కల్వకుంట రామకృష్ణ,  నంది శ్రీనివాస్, గాజులరవీందర్,గంప ఉమాపతి, గజేందర్ రెడ్డి, కూకట్ల తిరుపతి, కేఎస్ అనంత ఆచార్య, మేన్నేని శశి  కిరణ్మయి, సిహెచ్ రజిత నీలగిరి అనిత తదితరులు తమ కవితలను వినిపించారు.

 

     ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  బోయినపల్లి వినోద్ కుమార్,చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు,కొత్తపల్లి మున్సిపల్  చైర్మన్ రుద్రరాజు, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్,శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డిఓలు ఆనంద్ కుమార్, హరిసింగ్,కార్పొరేటర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post