కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా మార్పు సాధించవచ్చు… ఎంపి మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా మార్పు సాధించవచ్చు… ఎంపి మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా మార్పు సాధించవచ్చు… ఎంపి మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ కె. శశాంక.

కేసముద్రం,
మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ -30:

కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా మార్పు సాధించవచ్చని పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత , జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శనివారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డు పొందిన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పార్లమెంట్ సభ్యురాలు మలోతు కవిత, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎం.పి. మాట్లాడుతూ, భారతదేశంలో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డు ను గిరిజన జిల్లా మహబూబాబాద్ కు రావడం గర్వంగా ఉందన్నారు. అప్పటి కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులు, అందరి కృషితో ఇది సాధ్యమైంది అని తెలిపారు. నిజామాబాద్ తర్వాత కేసముద్రం మార్కెట్ నిలుస్తుందని, ఈ నామ్ ఆన్లైన్ ద్వారా అందించిన సేవలకు గుర్తింపు వచ్చిందని, కోల్డ్ స్టోరేజ్, మోడల్ మార్కెట్ కొరకు ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ తయారు చేసి పంపాలని, ముఖ్యమంత్రి తో మాట్లాడతానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దాదాపు 800 మార్కెట్ లతో పోటీ పడి చివరి 5 మార్కెట్ ల వరసలో నిలబడి అవార్డ్ కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అవార్డ్ వచ్చిన సందర్భంగా ఒక సభను ఏర్పాటు చేసుకొని ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ సన్మానించుకోవలసిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు ఈ అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కష్టపడితే సాధ్యం కానిది ఏది లేదని, కష్టపడి పనిచేస్తే ఏ రంగంలో నైన మార్పు సాధించవచ్చని తెలిపారు. మార్కెట్ గతంలో కంటే దినదినాభివృద్ధి సాధించడం, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ – నామ్) ద్వారా విజయవంతంగా సేవలు అందించినందుకు 2019 సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య, అప్పటి మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారుల కృషితో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి చేస్తున్న కార్యక్రమాలతో గుర్తింపు వచ్చిందని, అవార్డు రావడానికి చాలా మంది సహకారం ఉందని, అప్పట్టి ఆదర్శ రైతులు, నమ్మిన కూలీలు, దరువాయిలు, traders సహకారం ఎంతో ఉందని, కమిషన్ ఏజెంట్ లు లేకుండా పంట ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో ఒకే రకమైన ధరను కల్పించాలనే లక్ష్యంతో ఈ-నామ్ ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ద్వారా పంట ఉత్పత్తులకు గరిష్ట ధర లభించడం, తూకంలో పారదర్శకత పాటించి అంతర మార్కెట్ లో ఆన్లైన్ టెండర్ ప్రక్రియలో క్రయ, విక్రయాలు ఈ నామ్ ద్వారా జరిపి రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చడంలో అందరి సమిష్టి కృషితో విజయవంతమైన సేవలు అందిస్తున్నందున జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. మీరు అడిగిన అన్ని విషయాల పై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తానని తెలిపారు. 710 జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డు అందుకోవడం గర్వకారణమని తెలిపారు.

ఇతర అంశాలలో కూడా అవార్డులు వస్తాయి కాని, వేలాది మంది రైతులకు సహాయపడి, వారీ జివితంలో మార్పులు తీసుకొచ్చిన సందర్భముగా అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కష్టపడి ఇతర రంగాలలో కూడా ఇలాగే గుర్తింపు తీసుకురావాలని కోరారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, అన్నం పెట్టే రైతు ల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వం మనదని, ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని, ఈనామ్ వ్యవస్థలో రైతుకు లాభం చేకూర్చే విధంగా, సుమారు 800 మార్కెట్లు పోటీ పడగా చివరి 5 మార్కెట్లలో కేసముద్రం మార్కెట్ నిలిచి అవార్డు సాధించడం, అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, ఈనామ్ వ్యవస్థ ఒక విప్లవం అని, పండించిన పంటను అమ్ముకునే సమయంలో దళారీల వ్యవస్థ లేకుండా ఆన్లైన్ లో ఎక్కువ ధరకు అముకొని, సాయంత్రం లోగా రైతుల జేబుల్లోకి డబ్బులు వెళ్లేలా ఈ నామ్ ద్వారా సాధ్యమైందని తెలిపారు. ఢిల్లీ నుండి ఈ అవార్డు అందుకొని వచ్చిన కలెక్టర్ ను ఈ సందర్భంగా సన్మానించడం గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక ను ఎంపి, ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే విజయవంతమైన సేవలు, సహాయ, సహకారాలు అందించి జిల్లాకు పేరు తీసుకొని రావడంలో తోడ్పాటునందించిన అప్పటి, ఇప్పటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కార్యదర్శి, సభ్యులు, ప్రజా ప్రతినిధులకు, వ్యవసాయ, జిల్లా అధికారులకు, మార్కెట్ యార్డ్ అధికారులను, సిబ్బందిని, వ్యాపారులను, రైతులను ఎంపి, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, తహసిల్దార్, ఎంపీపి., జెడ్పీటీసీ, ఎంపిటిసి, సర్పంచ్, పి. ఏ.సి.ఎస్. చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, రైతు కో ఆర్డినేటర్ లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతునాయకులు, కార్మికులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు,
——————————————————-

జిల్లా పౌర సబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.Share This Post