కసితో చదివి ఉద్యోగాలు సంపాదించండి – డి ఎస్ డి ఓ విజయలక్ష్మి

కసి పట్టుదల ఉంటె ఏదైనా సాధ్యమని, మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాలు మీ సొంతమని ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఎస్సి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-I,II,III & IV ఉద్యోగాల కోసం అర్హులైన యువతకు ఉచితంగా ఇచ్చే శిక్షణా కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను, సర్టిఫికెట్లను పరిశీలించారు. మొత్తం 75 దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 50 మందిని అర్హులుగా గుర్తిస్తూ వారికి అడ్మిషన్ స్లిప్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపికైన అభ్యర్థులకు మే 1 నుండి రెండు మాసాల పాటు ప్రీ ఇగ్జామినేషన్ ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందని అన్నారు. కాబట్టి యువత తలదించి ఇష్టపడి చదివి ఉద్యోగం సంపాందించి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ. లింగేశ్వర్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post