కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, మనోధైర్యంతో  ముందుకు సాగితే  విజయాలు మీ స్వంతం :మని  జిల్లా కలెక్టర్ నిఖిల

కసి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, మనోధైర్యంతో  ముందుకు సాగితే  విజయాలు మీ స్వంతమని  జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.

సోమవారం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సబ్ ఇన్స్పెక్టర్ , పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఏర్పాటు చేసిన  శిక్షణ ఉచిత  శిభిరాన్ని  జిల్లా కలెక్టర్  సందర్శించారు.  ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం  ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు సంబంధిత  శాఖల పరంగా ఉచిత శిక్షణను ఇవ్వడం జరుగుతుందని అన్నారు.    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  తర్వాత గానీ ,  ముందుగాని  చరిత్రలో ఎప్పుడు లేని విదంగా   వివిధ శాఖల్లో ఖాళీగా  ఉన్న 80 వేల  ఉద్యాగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  అదేవిదంగా పోలీస్ శాఖలోనే 40 వేల ఉద్యాగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నట్లు కలెక్టర్ అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకునే విదంగా ప్రోత్సహించేందుకు  ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఉచిత  శిక్షణ శిభిరంలో  అధ్యాపకులు, నివాసం, బోజనం ఖర్చులతో  పాటు 2 వేల రూపాయల  స్టడీ మెటీరియల్ ను  కూడా అందచేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. శిక్షణ అనంతరం  స్టడీ మెటీరియల్ మాత్రమే కాకుండా ప్రతి సబ్జెక్టు పైన అవగాహనా కల్పించుకొని పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని  యువతకు సూచించారు.  ప్రస్తుతం ఇస్తున్న 2 నెలల శిక్షణ అనంతరం  సబ్జెక్టును మరచిపోకుండా ఉండేందుకు వీలుగా  ప్రతి నెల జిల్లాలో పరీక్షలు నిర్వించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మీ తల్లి దండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.    రాష్ట్ర వ్యాప్తంగా 12 పోలీస్ రెసిడెన్షియల్ జిల్లా శిక్షణ కేంద్రాలు (డీటీసీ)  ఉండగా , వికారాబాద్ జిల్లాలో అన్ని సౌకర్యాలతో డీటీసీ ఉండడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు.  అదేవిదంగా ఎస్సి , ఎస్టీ నిరుద్యోగ యువతకు ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు కృషి తీసుకున్న పోలీస్ శాఖను కలెక్టర్ అభినందించారు.

జిల్లా సూపెర్టిండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్. కోటి రెడ్డి మాట్లాడుతూ అపోహలకు తావునివ్వకుండా ఆత్మ విశ్వాసంతో చదువుతూ ముందుకు సాగాలని అన్నారు.  పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాందించాలంటే ఓర్పు చాల అవసరమని అన్నారు.   చదువుకునేందుకు ఆర్థికం, పేదరికరం ఏది అడ్డురాకూడని నిరాశకు తావునివ్వకుండా కృషి  చేయాలని సూచించారు. రెగ్యులర్ చదువులకు,  పోటీ పరీక్షలకు   ఎంతగానో తేడా ఉంటుందని దానికనుగుణంగా  చదుకోవాలని తెలిపారు.  పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచడం జారుకుతుందని ఎస్పీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లేశం , జిల్లా ట్రైబల్ అభివృద్ధి అధికారి కోటాజీ , డీటీసీ ప్రిన్సిపాల్ పి.వి. మురళీధర్ , వైస్ ప్రిన్సిపాల్  పి.విజయ కుమార్ , డిఎస్పీ సత్యనారాయణ, అధ్యాపకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

Share This Post