*కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్.*

*కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్.*

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -02:

మహబూబాబాద్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాత్రిపూట స్టడీ అవర్స్ లో తరగతి గదిలో కూర్చొని చదువుతున్న విద్యార్ధినుల తో మాట్లాడారు. భోజన, వసతి సౌకర్యాలపై ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసు కున్నారు. స్టోర్ రూం, గదులను పరిశీలించారు. స్టోర్ కు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని, పారిశుధ్యం పాటించాలని, వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. మంచిగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలని తెలిపారు.

ఈ తనిఖీలో డి.ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై, వార్డెన్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post