కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు కు కృషి :పర్యాటక శాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

మంగళ వారం రోజున ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, పాలంపేట గ్రామంలో కొలువైన రుద్రేశ్వర స్వామి దేవాలయం రామప్ప కు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, పంచాయితి రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘంఉపాధ్యక్షుడు  బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపి శ్రీమతి కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, మాజీ ఎంపి సీతారాం నాయక్, ఇతర అధికారులు నేతలు రుద్రే శ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామప్ప దేవాలయం అంతా తిరిగి చూశారు.అనంతరం రామప్ప ప్రాంగణంలో మొక్కలు నాటారు.అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పర్యటక శాఖ మంత్రి గారు మాట్లాడుతూ వందల వేల సంవత్సరాల నుండి ఉన్న వారసత్వ చరిత్ర గల ఈ ప్రాంతం తెలంగాణ వచ్చేంతవరకు గుర్తింపు రాలేదని, తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈ యొక్క ఖ్యాతినీ కల్పించారని వారు అన్నారు. ఈ ప్రపంచ స్థాయిలో ఎన్నో పథకాలకు మన రాష్ట్రం ఒక ప్రయోగాల శాల గా మార్చి తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం రాష్ట్రానికే గర్వంగా కారణం అని మంత్రి అన్నారు. 21 దేశాలు కలిసి ఈ యొక్క రామప్ప గుర్తింపుకు సపోర్ట్ ఇచ్చారని వారు అన్నారు. దీనికి కారణం మన ముఖ్య మంత్రి గారు అని వారు అన్నారు. ముఖ్య మంత్రి గారి ఆదేశాలమేరకు రామప్ప పర్యటించి ఇంకా దీనిని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపైన ప్రణాళికలు తయారు చేయాలనీ వారు అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నాయకులూ కోరుతున్నారని, వేయి స్థంబాల గుడి నుండి వరంగల్ ఫోర్ట్ తదితర ఎన్నో అద్బుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయని వారు అన్నారు. హైదరాబాదు తర్వాత ఉమ్మడి వరంగల్లు జిల్లా ముందు ఉంటుందని వారు అన్నారు. ఈ సందర్బంగా పంచాయితి రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఈ రామప్పను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా యునెస్కో గుర్తింపు రావడం ,ప్రప్రంచ స్థాయి లో ఖ్యాతి వచ్చిందని వారు అన్నారు. ముఖ్యమంత్రి కృషిలో చాలామంది దీని వెనుక ఉన్నారు. ఎంపీలుగా, పాపారావు, పాండురంగ రావు చేసిన కృషి కీలకం అని మంత్రి గారు అన్నారు. దీనిని టూరిజం హబ్ గా చేసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. స్థానికుల సహకారం అవసరం అని వారు అన్నారు.భూసేకరణ 27ఎకరాలు ఉందని,మిగిలిన భూమికి రైతులు సహకరించాలి వారి అందరికీ న్యాయం చేస్తాం అని వారు అన్నారు.రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. ఇప్పటికే పర్యాటకులు రద్దీ పెరిగిందని, విదేశాలనుండి వచ్చే పర్యాటకులు 3 రోజులు ఉండేల అన్ని వసతులు కల్పించాలని వారు అన్నారు.రామప్ప దేవాలయం కు గుర్తింపు వస్తె పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని, ఈ ప్రాంత భవిష్యత్తు మారుతుందని సీఎం గారు వెంటపడి దేనికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేశారని వారు అన్నారు.17 దేశాలు అనేక ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానం ఇచ్చి, అడిగినవన్నీ చేసి దీనికి హోదా వచ్చే విధంగా చేశాయని, ఇది ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వ కారణం అని వారు అన్నరు.ఇంకా అభివృద్ధికి నిధులు కేటాయింపునకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం,కాకతీయ హెరిటేజ్ టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉందని మంత్రి గారు అన్నారు.దానిని ఏర్పాటుకు సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చేసే ప్రయత్నం చేస్తాం అని వారు అన్నారు.ఇక్కడ ఎవరికి నష్టం జరగకుండా చూస్తాం అని వారు అన్నారు.
ఈ సందర్భంగా స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ లో సీఎం కేసిఆర్ గారి ద్వారా ఈ ఆలయాల అభివృద్ది అవుతుందని గుర్తించి ఆయన చేతుల మీదుగా యునెస్కో గుర్తింపు రావడం, ప్రపంచం రామప్ప వైపు చూసే గొప్ప అవకాశం వచ్చింది అని వారు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దేనికి లభించని గుర్తింపు మనకు రావడం నిజంగా గర్వకారణం అని వారు అన్నారు.సీఎం కేసిఆర్ గారికి తెలంగాణ, ఇక్కడి కళలు, శిల్ప నైపుణ్యం పై ఆయనకున్న పట్టు ఎవరికీ లేదు. అందుకే ఆయన కృషి ఫలించింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని మంత్రి గారు అన్నారు.ఏ టెక్నాలజీ లేనపుడు ఇంత గొప్ప కట్టడం నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయం అన్నారు.కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పేరిట పాపారావు, పాండురంగ రావు, ఎంపీలు చేసిన కృషి అన్ని తోడై నేడు దీనికి గొప్ప గుర్తింపు వచ్చిందని వారు అన్నారు.యునెస్కోలో కొన్ని షరతులు పెట్టినప్పుడు గొప్ప దౌత్యం చేసి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ, ఇందుకు ముందడుగు వేసిన సీఎం కేసిఆర్ గారికి పాదాభివందనం అని వారు అన్నారు.ఇక్కడికి భక్తులు, పర్యాటకులు పెరుగుతున్న నేపథ్యంలో ఔట్ పోస్ట్, డ్రింకింగ్ వాటర్, కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ములుగు శాసన సభ్యురాలు సీతక్క మాట్లాడుతూ ములుగు గడ్డకు ప్రత్యేకత ఉందని రామప్ప కి యున్దేస్కో గుర్తింపు రావడం సంతోషం గా ఉందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో, ఎంపీ మాలోత్ కవిత , స్థానిక సంస్థల mlc పోచారం శ్రీనివాస్ రెడ్డి , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షడు బోయినపల్లి వినోద్ కుమార్, జలవనరుల సంఘం చైర్మన్ వీరమల్ల ప్రకాశరావు , వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ టూరిజం సెక్రటరీ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్,dro రమాదేవి, స్థానిక సర్పంచ్ రజిత ,ఎంపీటీసీలు జడ్పీటీసీలు రామప్ప ఇ.ఓ బిల్లా శ్రీనివాస్ ఎమ్మార్వో మంజుల మరియు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

—————————————————————————————–
డిపిఆర్ఓ ములుగు జిల్లా గారిచే జారీ చేయడమైనది.

 

Share This Post