కాగజ్‌నగర్‌ కాగితపు మిల్లును లాభాల బాటలోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కాగితపు మిల్లును నిర్వహణ లోపాలు లేకుండా అందరి సమన్వయంతో లాభాల బాటలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా రవాణ శాఖ అధికారులు, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులతో కాగితపు మిల్లు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కాగితపు మిల్లు నిర్వహణ లోపాలు లేకుండా చేపట్టాలని, ఎవరికి ఇబ్బందులు కలగకుండా నిర్వహణ ఉండాలని తెలిపారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ వారు అనధికారిక చర్యలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని, అన్ని లారీలకు తప్పనిసరిగా రశీదులు అందించాలని, లాదీ అసోసియేషన్‌ సభ్యులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. లారీ అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ స్థానిక లాదీలకు ఒప్పందం ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని, ట్రాన్స్‌పోర్ట్‌ను నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. కంపెనీకి లాభాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మి కాగితపు మిల్లు ప్రతినిధులు, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post