కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలను ఈ నెల 30 వ తేది నుండి వచ్చే నెల6వతేది వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాల పై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ల తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా చీఫ్ విఫ్ మాట్లాడుతూ దర్గా ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతిక అని అన్నారు. కులమతాలకు అతీతంగా దర్గాల వద్ద ప్రార్దనలు జరుపు కోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నoదున, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైన లైటింగ్, రోడ్ల మరమత్తులు తక్షణమే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలనీ, వాటరు ట్యాంకులను పూర్తి స్థాయిలో శుభ్రపరచలని అన్నారు. ప్రతి భక్తుడు దర్గాను ప్రశాంతంగా సందర్శించడానికి అనుకూలమైన వాతావరణం ఉండాలని అన్నారు. ట్రాఫిక్ ను ఎప్పటి కప్పుడు క్రమబద్ధికరించాలని, అవసరమైన బార్ కెడింగ్లను ఏర్పాటు చేయాలన్నారు.

మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాల విజయ వంతానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎల్లవేళ అందుబాటులో ఉంటారని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు సమన్వయముతో పనిచేయాలనీ ఆదేశించారు.

జిల్లా కలేక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ కరోన తగ్గు ముఖం పట్టిన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వస్తారని అయన అన్నారు. నోడల్ అధికారుల జాబితాను సత్వరమే రూపొందించాలని అన్నారు. ప్రతిరోజూ శానిటేషన్ పకడ్బందీగా చేపట్టలని, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధలను పాటించే విధంగా చూడాలని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మందులు, అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉంచాలన్నారు.

ఈ సమావేశంలో నగర కమిషనర్ ప్రావీణ్య, సయ్యద్ షాహ అప్జల్ బియా బాని దర్గా పీఠాధిపతి ఖుసృ పాషా, ఉర్సు ఉత్సవ కమిటీ సభ్యులు అబూబాకర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి పుష్ప, డి ఆర్ ఓ వాసు చంద్ర, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీను, జిల్లా ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post