కాజ్ వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

కాజ్ వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 8: భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం అధికంగా ఉన్న నెల్లుట్ల, కుందారం గ్రామాల మధ్యనున్న కాజ్ వే ను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య బుధవారం పరిశీలించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఇట్టి మార్గం గుండా రాకపోకలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవిన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కాలినడకన కానీ, ఎటువంటి వాహనాలు కానీ అనుమతించకూడదని ఆయన తెలిపారు. పాలకుర్తి కి వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గం నేలపోగుల, చిన్నమడూర్ గుండా వెళ్లాలని సూచించాలని ఆయన అన్నారు. నీటిప్రవాహం సాధారణ స్థితికి వచ్చు వరకు కాజ్ వే వద్ద నిరంతర కాపలా పెట్టాలని అన్నారు. భారీ వర్షాలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కాజ్ వే ఎత్తు పెంచి, పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, లింగాలఘనపూర్ తహసీల్దార్ వీరస్వామి, అధికారులు తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post