కానాయపల్లె పరిధిలో గల శంకర్ సముద్రం చెరువులో చేపపిల్లలను, రొయ్యలను వదిలిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన 1.

తేది:21. 9 .2021
వనపర్తి

మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు మత్స్యకార అభివృద్ధి పథకం చేపట్టి, ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మంగళవారం వనపర్తి జిల్లాలోని కానాయపల్లె పరిధిలో గల శంకర్ సముద్రం చెరువులో ప్రభుత్వం 100% ఉచితంగా అందజేసిన నాలుగు లక్షల 80 వేల చేపపిల్లలను, లక్ష 20 వేల రొయ్యలను చెరు వులో వదిలారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాదరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వoసం అయ్యిందన్నారు. మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు.
కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్రంలో మత్స్య రంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌ దేననీ మంత్రి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం వనపర్తి జిల్లాలో రూ. 2 కోట్లతో 2.54 లక్షల చేప పిల్లలను, 7 లక్షల రొయ్య పిల్లలను జల వనరులలో వదులుతున్న మ నీ, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో
స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు నింపారని ఆయన తెలిపారు.
సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతం, పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్య కారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందని, ఈ అవకాశాన్ని మత్స్య కారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
మత్స్య కారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో ప్రతి చెరువులో చేప పిల్లలను విడుదల చేయాలని ఆయన తెలిపారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని,
జలవనరులలో కౌంటింగ్ లో రాజీ పడకుండా క్వాలిటీ చేప పిల్లలను అధికారులు విడుదల చేస్తున్నామన్నార నీ ఆయన వివరించారు. విడుదల ప్రక్రియ అద్యాంతం వీడియో గ్రఫి చేస్తున్నామని ఆయన తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్, ఇంటింటి కి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. మత్స్య కారులు చేపలను విక్రయించేందుకు టూ వీలర్, ఫోర్ వీలర్, మొబైల్ వాహనాలను అందజేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులవృత్తులకు ప్రాధాన్యత నిచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తున్నదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు, యాదవులకు కులవృత్తులు చేసుకునేందుకు సహాయ సహకారాలు అందించినట్లు ఆయన తెలిపారు. మత్స్య సంపద ద్వారా వారు సమాజానికి సేవ చేస్తున్నారని ఆయన వివరించారు. కులవృత్తుల ప్రాధాన్యతను బట్టి వారి కులవృత్తులను ఆదరిస్తున్న ట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కమిషనర్ లచ్చిరాం భోక్య, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ వామన గౌడ్, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ వంశీధర్, మత్స్యశాఖ ఎడి వెంకన్న, సర్పంచ్ సుదర్శన్ రెడ్డి కోళ్లవెంకటేష్ యం.పి. టి.సి. జడ్పి టిసిలు తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post