తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం
( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ )
పత్రిక ప్రచురణ మరియు ప్రసార నిమిత్తము తేదీ: 21/03/2023
రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి సిపిఆర్ గురించి శిక్షణ ఇవ్వాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన సి. పి. ఆర్ శిక్షణ కార్యక్రమమును ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, కూడా చైర్మన్ శ్రీ. సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ చీప్ విప్ శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో ముందున్నారని అలాగే రాష్ట్ర ప్రజల ఆరోగ్య స్థాయిని పెంచడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, గత రెండు
సంవత్సరాలలో కోవిడి మహమ్మారిని నియంత్రించుటకు ఎన్నో చర్యలు చేపట్టారని, అలాగే ఈ మధ్యకాలంలో మహిళల కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్లను ప్రారంభించారని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న సడన్ కార్డియా కరెస్టులను దృష్టిలో ఉంచుకొని సి పి ఆర్ లైఫ్ సేవింగ్ టెక్నిక్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారని దీన్ని వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లి అందరికీ శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వం ఒక్కక్కటి 2 లక్షల రూపాయల ఖర్చు అయ్యే
AED లను బస్ స్టాండ్ లు, కలెక్ట రేట్ లు, రద్దీగా ఉండే మార్కెట్ లు, ఇతర పబ్లిక్ ప్లేస్ లలో అందుబాటులో ఉంచే ఆలోచన
ఉందన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ గారు మాట్లాడుతూ జిల్లాలో ఐదుగురు వైద్యాధికారులు
మాస్టర్ ట్రైనింగ్ పొంది ఉన్నారని వీరందరూ ఈరోజు పోలీసు శాఖకు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు, మున్సిపల్ కార్పొరేషన్,
జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ శాఖ, డి ఆర్ డి ఓ, నెహ్రూ యువ కేంద్ర, అగ్రికల్చర్ శాఖలకు చెందిన
అయిదుగురు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారని ఈ సిబ్బంది వారి వారి డిపార్ట్మెంట్ లోకి వెళ్లి అక్కడ వారి సిబ్బందికి శిక్షణ
ఇవ్వాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖా ద్వారా ప్రత్యేక ప్రణాళిక తో శిక్షణ కార్యక్రమాన్ని
నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ భగీరథ గారు శిక్షణ పొందిన వైద్య అధికారులతో కలసి డెమోనిస్ట్రేషన్
చేసి సిపిఆర్ శిక్షణ ను అందించారు. సిపిఆర్ శిక్షణ అందించడంతో పాటు గుండె సంభదిత సమస్యలు రాకుండా జాగ్రత్తలను, ఆహార నియమాలను వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, కుడా చైర్మన్ శ్రీ. సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ తదితరులు సి.పి.ఆర్ విధానాన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి సుధారాణి గారు, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, అడిషనల్
కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి గారు, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు, అడిషనల్ డిఎం అండ్ హెచ్
ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, డిఆర్ఓ శ్రీ వసుచంద్ర, మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఏడి ఎస్సీ కార్పొరేషన్ శ్రీమతి మాధవి లత గారు, పిడి మెప్మా శ్రీ బద్రునాయక్ గారు, పరకాల మున్సిపల్ కమిషనర్ శేషు, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ హరికిషన్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యాకుబ్ పాషా, పి ఓ డి టి టి మరియు సిపిఆర్ శిక్షణ నోడల్ అధికారి డాక్టర్. లలితా దేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ హిమబిందు, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ గీతా లక్ష్మి, మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ ఇఫ్తాకర్ అహ్మద్, డాక్టర్ పద్మ శ్రీ, డాక్టర్ మంజుల, డాక్టర్ సాయి క్రిష్ణా, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, హెచ్ డబ్ల్యు ఓ చంద్రశేఖర్, డిప్యూటీ డెమో ప్రసాద్, డిపిహెచ్ఎన్ఓ సుశీల, సిహెచ్‌ఓ మాధవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి
హనుమకొండ జిల్లా
జిల్లా పౌర సంబందాల శాఖాధికారి గారి ద్వారా అన్ని పత్రికలలో ప్రచురణ నిమిత్తం సమర్పించనైనది.