కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ను సోమవారం నాడు ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ప్రారంభించారు

ప్రెస్ రిలీజ్. తేది 16.08.2021 కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ను సోమవారం నాడు ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ల్యాబ్ లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఐ సి యూ గదిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీయూలో పది బెడ్లు ఉన్నాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, సూపర్డెంట్ డాక్టర్ అజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, కౌన్సిలర్ సప్న పాల్గొన్నారు.

Share This Post