కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్, డ్రైవర్స్ కాలనీ లోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు

అంగన్ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్నా పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి బరువులను తూకం వేయించారు. ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా పిల్లలకు నాలుగు నెలలపాటు అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు. బలహీనంగా ఉన్న గర్భిణీలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. కాకతీయ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, పర్యవేక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ————— జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారీ చేయనైనది.

Share This Post