కామారెడ్డి పట్టణంలోని csi పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు

వార్డుల వారీగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని వైద్యలకు సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు కుటుంబాల వారీగా వ్యాక్సినేషన్ చేయించుకొని వారి వివరాలు నమోదు చేసి వారికి వ్యాక్సినేషన్ వేయించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వైద్యుడి సుజాత్ అలీ, ఆరోగ్య, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. ——————————– జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post