కళాశాల భవనంలో కొన్ని తరగతుల గదుల స్లాబ్ పై ఉన్న పెచ్చులు రాలుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ రాజకుమార్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఆయన కళాశాల తరగతి గదులను పరిశీలించారు. మరమ్మత్తుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచవలసిన బాధ్యత అధ్యాపక బృందం పై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కళాశాల సమీపంలోని ఆడిటోరియం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చూడాలని కోరారు. ఎన్ సి సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాశివనం లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , ప్రిన్సిపల్ రాజకుమార్, సీనియర్ అధ్యాపకుడు శంకరయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు. —————— జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.