కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని మౌళిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు:: ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని మౌళిక వసతులతో ప్రభుత్వ పాఠశాలలు:: ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఫిబ్రవరి.1

మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండలం తీగలవేణి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మనఊరు మనబడి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుజాత అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాఠశాలను ప్రారంభించారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా తీగలవేణి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, పేద విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో ఉచితంగా కార్పోరేట్ విద్యనందించడానికి రాష్ట్ర ప్రభుత్వం
భవనాలకు మరమ్మతులు మరియు రంగులు, అదనపు తరగతులు, కాంపౌండ్ వాళ్ళు, టాయ్ లెట్స్, మంచి లైటింగ్, ఫర్నీచర్, పచ్చని పరిసరాలు, పరిశుభ్రమైన త్రాగునీరు, డైనింగ్ హాల్స్ వంటి అన్ని విధాలా మౌళిక వసతులు కల్పించిందని, దానిలో భాగంగా ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని విద్యార్థులందరు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలన్నారు.

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు అన్ని మౌళిక వసతులతో ఉచిత విద్యను అందించి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మనఊరు-మనబడి అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.

ఎంపిపి సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకై చేపడుతున్న పథకాలలో మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా కల్పించేటువంటి వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మంచిగా చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని నా కోరిక అని అన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శైలజా రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం విద్యపట్ల ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతుందని,విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో
ఎం.పి.పి.సుజాత,గ్రామ సర్పంచ్ శైలజ రెడ్డి,వైస్ ఎం.పి.పి.ఆర్య వీరయ్య, ఎంపిటిసి వాసుదేవరెడ్డి, డిటీడీవో ఎర్రయ్య, తహశీల్దార్ అశోక్,ఎంపిడిఓ, హెచ్ ఎం.భిక్షపతి , జిల్లా అధికారులు,ప్రజలు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post