కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

నిరుపేదలకు మెరుగైన విద్యా , నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు

 

ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకే మన ఊరు మనబడి కార్యక్రమం

 

విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలి

 

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

 

00000

     పేదలు, నిరుపేదలకు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్య అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

 

 

     బుధవారం కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగారూ 27.24 లక్షల రూపాయల వ్యయంతో చేసిన పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, వసతులు లేక చాలామంది పిల్లలు చదువుకు దూరం అయ్యారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు ఎవరు కూడా దూరం కావద్దని, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు, మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా వేలాది కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ బడులలో భవన మరమ్మత్తులు, పాఠశాలలకు రంగులు, అదనపు గదుల నిర్మాణం, టాయిలెట్స్. కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, లైటింగ్, ఫర్నిచర్, డిజిటల్ తరగతులు పచ్చని పరిసరాలు పరిశుభ్రమైన త్రాగునీరు వంటి 12 రకాల వసతులతో పాఠశాలలను అధునాతన పాఠశాలలుగా తీర్చిదిద్ది బడి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదలు కేజీ టు పీజీ వరకు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను అధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లాలో మొదటి విడత 230 పాఠశాలల్లో ఆధునీకరణ కొరకు 92 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడాన్ని చిన్నచూపుగా భావించే పిల్లల తల్లితండ్రులు, తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో సీటు ఇప్పించమని కోరే స్థాయికి తెలంగాణ విద్యా ప్రమాణాలను అభివృద్ది చెందాయని మంత్రి అన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అద్బుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని బాగా చదువుకోని, ప్రజల మన్నలను పొందేలా ఎదగాలని అన్నారు.  గతంలో చదువు కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేదని, ఆర్థిక పరిస్థీతుల దృశ్యా తల్లితండ్రులు చిన్నతనంలోనే మగపిల్లలను కూలీ పనులకు, ఆడపిల్లలకు పెళ్లీలు చెసేవారని,  ఆలాంటి చదువు కొందరికి మాత్రమే కాదు అందరికి అందాలనే సంకల్పంతో కేజి మొదలుకొని పీజీ వరకు ఉచితంగా చదువుకునే అద్బుత అవకాశాలను కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సరస్వతి సమానులని పేర్కోన్నారు.  పిల్లలందరు బడి ముగిసి ఇంటికి వెళ్లిన వెంటనే సెల్ ఫోన్, టివి వంటి వాటికి కొంత దూరంగా ఉండాలని, రేపటి రోజు ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగిన మీకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించి సత్కరించుకోవాలని తెలిపారు.  ప్రైవేటు పాఠశాలల్లో అరకొర చదువుకున్నవారిని కూడా  టీచర్లుగా నియమిస్తుంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం బాగా చదువుకొని, ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులను సాధించిన వారిని మాత్రమే టీచర్లుగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.  ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని గురుకులాలను ఏర్పాటుచేసి  ప్రతి ఒక్క విద్యార్థిపై లక్షా ఇరవై వేలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు.

 

             జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ  పిల్లలందరు చదువుకొవడానికి వీలుగా మూడేళ్ల వయస్సులోని పిల్లల కొసం ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాల నుండి 10వ తరగతి వరకు అద్బుతంగా చదువుకునే అవకాశాలను ఒకే పాఠశాలలో కల్పించడం జరిగిందని పేర్కోన్నారు.  పాఠశాల విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా వారిలో మానసిక ఉత్సహన్ని పెంపొందించేలా వాలిబాల్, కబడ్డి వంటి ఆటలు ఆడుకోవడానికి ఆట స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని  తెలిపారు.   పాఠశాల స్థాయి విద్యార్థికి ఎక్కడ అసౌకర్యం కలుగకుండా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలను అభివృద్ది చేసుకోవడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి బాగా చదువుకుని మంచి స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

 

            స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,  పిల్లలకు మంచి విద్యా అవకాశాలను కల్పించడంతో పాటు చక్కటి వాతావరణాన్ని అందించేలా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కనీస  మౌళిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉన్న 230 పాఠశాలలను జిల్లాలో గుర్తించడం జరిగిందని పేర్కోన్నారు.  పాఠశాలల అభివృద్దిని ప్రత్యక్షంగా పర్యవేక్షణలో పనుల జరిగేలా ఎస్.ఎమ్.సిని ఏర్పాటు చేసుకొవడం జరిగిందని, మొదటి విడతలో జిల్లాలో 18 మోడల్ పాఠశాలలను ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుందని  తెలిపారు.

 

            కార్యక్రమంలో చివరగా  తొలిమెట్టు కార్యక్రమంలొ బాగంగా విద్యార్థులు తయారు చేసిన బోధనోపకరణాలను మంత్రి, జిల్లా కలెక్టర్ లు పరిశీలించి వాటిని గురించి విద్యార్థులను అడిగితెలుసుకున్నారు.

 

              ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సనీల్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, యంపిటిసి  పట్టెం శారదా , యంపిటిసిలు  పట్టెం శారద, భూక్య తిరుపతి నాయక్,జట్పిటిసి  కరుణ, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మి నరసింహ రావు, యంపిడిఓ, ఇతర అధికారలు, ప్రజాప్రతినిధుల పాల్గోన్నారు.

Share This Post