కార్పొరేట్ స్థాయి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
డిసెంబర్ 7 ( మంగళవారం ).
కార్పొరేట్ స్థాయి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
సోమవారం రోజున మల్లం పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు టీచర్స్ అటెండెన్స్, విద్యార్థినీ విద్యార్థుల అటెండెన్స్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని అన్నారు. 10వ తరగతి విద్యార్థిని విద్యార్థుల విద్యా నైపుణ్యాలు సబ్జెక్టులవారీగా పరిశీలించారు వసతులు సరిగా ఉన్నాయా లేవా అని విద్యార్థినీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా స్టోన్ డస్ట్ వేయించుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ప్రత్యేక విద్యా బోధన ద్వారా పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ ఐలయ్య సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Share This Post