కార్మిక శాఖ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇ -శ్రమ్ అవగాహన మరియు రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ. పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్.

కార్మికుల అభివృద్ది,మెరుగైన ఉపాధికి ఇ-శ్రమ్ సహకారం

నగర కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ

000000

     సంఘటిత మరియు అసంఘటిత కార్మికుల నైపుణ్యాల అభివృద్ధికి, మెరుగైన ఉపాధి అవకాశాలను ఇ- శ్రమ్ కార్డు సహాకరిస్తుందని నగర పోలీస్ కమీషనర్  (సి.పి.) వి. సత్యనారాయ అన్నారు.  శుక్రవారం కలక్టరేట్ ఆడిటోరియంలో కార్మికశాఖ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియోషన్ సంయుక్త అద్వర్యంలో నిర్వహించిన అవగహన మరియు నమోదు (రిజిస్ట్రేషన్) కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతిప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలోని అన్నిరకాల కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి ఇ-శ్రమ్ తోడ్పాటునందిస్తుందని, ఈ కార్డు ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద భీమా మరియు కోవిడ్-19 వంటి ఏదైనా జాతీయ సంక్షోభ సమయాల్లో డి.బి.టి ద్వారా కార్మికులకు నేరుగ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని, ఈ ఆర్థిక సహాయాన్ని మద్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకుఖాతాలో జమచేయడం జరుగుతుందని పేర్కోన్నారు.  ఇటువంటి మంచి కార్యక్రమామును ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సేవలను సిపి ఈ సందర్బంగా అభినందిస్తూ, అసోసియేషన్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.

    అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఇ శ్రమ్ పై అవగాహన, నమోదు మరియు కార్డుల పంపిణి పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని, కార్మికులు ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబరు మరియ ఫోన్ నెంబర్లు లింక్ తో ఇ -శ్రమ్ కార్డు పొందగలుగుతారని పేర్కోన్నారు.  అసంఘటిత రంగ  కార్మికులకు అండగా ఉండేందుకు కేంద్రప్రభుత్వం ఇ-శ్రమ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, అసంఘటిత రంగ కార్మికులు మరియు  కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకువచ్చాయని అందులో ముఖ్యంగా ఇ-శ్రమ్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ, సోషల్ సెక్యూరిటి బోర్డు ఫర్ అనార్గరైజడ్ వర్కర్స్ మరియు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియోషన్ ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

అనంతరం  ఇ-శ్రమ్ లో నమోదు చేసుకున్న పలువురు కార్మికులకు ఇ-శ్రమ్ గుర్తింపు కార్డులను అందజేసి, కార్యక్రమంలో అథితులుగా పాల్గోన్న సిపి, జాయింట్ కలెక్టర్ తో పాటు పలువురు అధికారులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ ఆఫ్ లేబర్ రమేష్ బాబు,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, జిల్లా ఇండస్ట్రీయల్ మెనేజర్ నవీన్ కుమార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి దెవేందర్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ అధికారి కోటేశ్వర్లు, జిల్లా ఇశ్రమ్ రిజిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్ ఎల్. మాళవిక, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గోన్నారు.

Share This Post