కాలుష్య నివారణ కై అందరు మట్టి వినాయకున్ని ప్రతిస్టించాలి :- జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా ‘

తేది: 08-09-2021

కాలుష్య నివారణ కై అందరు మట్టి వినాయకున్ని ప్రతిస్టించాలి:-  జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన

జిల్లా లో ప్రతి సవత్సరం  మాదిరిగానే ఈ సవత్సరం కూడా వినాయక నిమజ్జనం శాంతి యుతంగా జరుపుకుందామని జిల్లా  ఎస్పీ డా. చేతన ప్రజలకు పిలుపునిచ్చారు.   బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రజా ప్రతినిధులు మతపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులతో అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్టం లోనే  నారాయణపేట జిల్లా లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని మంచి  పేరుందన్నారు.  జిల్లా లో చుట్టూ పక్కల ప్రాంతాల నుండి  చాలా మంది ప్రజలు వస్తుంటారు కాబట్టి కోవిడ్-19 నిభందనలు పాటిస్తూ అందరు మాస్క్ దరించి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.  కాలుష్య నివారణ కై అందరు మట్టి వినాయకున్ని ప్రతిస్టించాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల నీరు కలిషితమై పర్యావరణాన్ని దేబ్బ తీస్తుందన్నారు.  అందుకే మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్టిస్తే బాగుంటుందన్నారు.   నిమజ్జనం సమయం లో ట్రాక్టర్ ల దగ్గర ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు , అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని  సూచించారు. ఉత్సవ కమీటి సభ్యులు మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో గణేష్ మార్గ్ గుండా  మిషన్ భగీరథ పైప్ లైన్ కై తవ్విన గుంతలను మూసివేయాలని సమావేశం  దృష్టికి తీసుకో రాగ వాటిని మూసివేయడం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి మాట్లాడుతూ ప్రతి వినాయకుడి మండపం లో ఒకరు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చెరువుల  దగ్గర క్రేన్ ను ఏర్పాటు చేయడం అలాగే విద్యుత్ దీపాలు  ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను  సూచించారు. ప్రతి మండపం  సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం ద్వారా స్ప్రే చేయించి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఉత్సవ కమిటి సభ్యులను సూచించారు.   నిమజనం  రోజు అన్నదానాలు జరిగే చోట్ల ప్రత్యేకంగా చెత్త సేకరణ కై ట్రాక్టర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అఫనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి తెలిపారు.  ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా  సామరస్యంగా ఉత్సవాన్ని జరుపుకోవాలని జిల్లా యస్పి డాక్టర్ చేతన కోరారు.

 

ఈ కార్యక్రమం లో అర్దిఒ వెంకటేశ్వర్లు,  జిల్లా అధికారులు మురళి, లియాఖత్ ఆలి, నరేందర్, రాములు, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ చంద్ర కాంత్, డియస్పి మధుసూదన్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినరయన్ భట్టాడ్, CI శ్రీకాంత్ రెడ్డి వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

————–

జిల్లా పౌరసంబంధాల అధికారి ద్వారా జారీ

Share This Post