కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి జూన్ 7:- పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు లు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ ,కిష్టంపేట గ్రామాలలో కలెక్టర్ పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించారు.

మన ఊరు మనబడి కార్యక్రమం కింద కిష్టం పేట గ్రామంలో చేపట్టిన యూపీఎస్ పాఠశాల , శ్రీరాంపూర్ గ్రామంలో చేపట్టిన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన నర్సరీని కలెక్టర్ పరిశీలించి నర్సరీ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 8వ విడత హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కులు సమకూర్చాలని అధికారులకు ఆదేశించారు.

గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతివనం పరిశీలించిన కలెక్టర్ మొక్కల సంరక్షణకు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త ను వేర్వేరుగా సేకరించే గ్రామంలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డు వినియోగించాలని కలెక్టర్ తెలిపారు.

శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మించిన స్మశాన వాటిక పరిశీలించిన కలెక్టర్, విద్యుత్ సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని ట్రాన్స్కో అధికారులకు కలెక్టర్ సూచించారు.

మండల ప్రత్యేక అధికారి ఆదిరెడ్డి,జడ్పిటిసి తిరుపతి రెడ్డి, ఎంపీపీ సంపత్,తహసిల్దార్ సునీత,ఎంపీడీవో రామ్మోహన్ చారి, సర్పంచ్ లు శ్రీదేవి రాజు, కాసర్ల తిరుపతి రెడ్డి,సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share This Post