కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

పత్రికా ప్రకటన

తేదీ 26 -01-2022

కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్

-o0o-

కాళేశ్వరం ప్రాజెక్టు మూడవ టిఎంసి వరద కాలువ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్ అన్నారు.

బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టిఎంసి వరద కాలువ భూసేకరణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రైతుల చే గ్రామ సభలు నిర్వహించి భూములు ఇచ్చుటకు సమ్మతి తెలిపేలా వారిలో అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు తమ భూములను కోల్పోతున్న వారికి ప్రభుత్వం తరఫున మంచి రేటు వచ్చేలా కృషి చేస్తామని తెలపాలని సూచించారు. గ్రామసభలు పూర్తి అయిన చిప్పకుర్తి, శ్రీరాములపల్లి, రామడుగు, నాగిరెడ్డిపూర్ గ్రామాలకు సంబంధించి సమ్మతి తెలిపిన రైతుల భూముల వివరాలతో జనవరి 31లోగా పేపర్ పబ్లికేషన్ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. మిగిలిన గ్రామాలలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి రైతుల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. కొన్ని గ్రామాలలో రైతులు ఇల్లు కోల్పోతున్నారని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ .ఈ శ్రీధర్, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్, రామడుగు తాసిల్దార్ కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం చే జారి చేయబడినది.

Share This Post