*కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 కు అవసరమైన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 కు అవసరమైన భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-1

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 16: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు కెనాల్ కోసం 1.1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న లింక్ -2 కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. బోయినిపెల్లి మండలం వరదవెల్లి, విలాసాగర్ గ్రామాల్లో అవసరమైన మేరకు భూసేకరణ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నిర్వాసితులు భూ సేకరణకు, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమీక్షలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఈఈ శ్రీధర్, డీఈఈ విష్ణు, బోయినిపెల్లి తహసీల్దార్ యుగేందర్, పర్యవేక్షకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post