కాళోజీ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—-1
ప్రజాకవి కాళోజీ స్పూర్తిప్రధాయులు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి,సెప్టెంబర్ 09
:- ప్రజాకవి కాళోజీ గారు స్పూర్తి ప్రధాయులని, వారి రచనలు అనేక మందిని చైతన్యం వైపు నడిపించాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి 107వ జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కాళోజీ చిత్రపట్టానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి కలెక్టర్ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరిచే విధంగా కాళోజీ గారు అనేక రచనలు చేసారని, తెలంగాణ భాషయాసనును వ్యాప్తి చెందే విధంగా ఆయన రచనలు ఉండేవని గుర్తు చేసారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కాళోజీ గారి రచనలు ఎంతో దోహదపడ్డాయని, ఆయన స్పూర్తితో ఆయన జన్మదినం నాడు తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ అన్నారు. తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిద్వనిగా కాళోజి గారిని కొనియాడతారని, రాజకీయ చైతన్యాల సమాహారమని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రజావాదిగా ఆయన గుర్తింపు సాధించుకున్నారని ,ప్రజల ప్రతి పోరాటంలో సాహిత్య పరమైన సహకరం అందీంచారని తెలిపారు. కాళోజీ పుట్టుక నీది, చావు నిది, బ్రతుకంతా దేశానిది అని చెప్పిన విధంగా ఆయన జీవనం మొత్తం దాని పాటిస్తూ తెలంగాణలో ప్రజల మధ్య చైతన్యం వ్యాప్తి చేందేలా కృషి చేసారని కలెక్టర్ అన్నారు నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి , ఆరాచన పాలనకి వ్యతిరేకంగా తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచారని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం ఆయన భాగస్వాములని కలెక్టర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు కాళోజీ అని అన్నారు. కాళోజీ గారు చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న వైద్య విద్యాలయానికి సైతం కాళోజీ గారి పేరు పెట్టి ఆయనను గౌరవించడం జరిగిందని అన్నారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజి అని, అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి –అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడని కాళోజి సగర్వంగా ప్రకటించి , ఉద్యమమే ఉపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావుని తెలిపారు. కాళోజి తెలుగు, మరాఠి , ఉర్దూ, కన్నడ, ఆంగ్లం, హిందీ వంటి భాషల్లో అనేక రచనలు చేసారని, రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజి దిట్టని, నాగొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యల పై నిక్కచ్చిగా కటువుగా స్పందిస్తూ పాలకుల పై రచనలు చేసారని తెలిపారు. కాళోజి 1939లో హైదరాబాదులో హైకొర్టుకు అనుసంధానంగా ఉన్న న్యాయకళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టాపొందాడని, సత్యాగ్రహొద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయస్సులో జైళ్లు శిక్ష అనుభవించాడని తెలిపారు.

       స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి రావు,ఈ.డి.ఎస్. సి. కార్పొరేషన్  రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ .కె.వై. ప్రసాద్, కలెక్టరేట్  సూపరిండెంట్ లు తూము రవీందర్,దత్తు ప్రసాద్,నారాయణ,అనుపమ రావు,కలెక్టరేట్ సిబ్బంది,  సంబంధిత అధికారులు, తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీచేయనైనది.

Share This Post