కాస్ట్ అకౌంటింగ్ శాతవాహన చాప్టర్ ప్రారంభోత్సవంతో ఎస్సారార్ కళాశాల విద్యార్థుల కు ఉజ్వల భవిష్యత్తు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్

కాస్ట్ అకౌంటింగ్ శాతవాహన చాప్టర్ ప్రారంభోత్సవంతో

ఎస్సారార్ కళాశాల విద్యార్థుల కు ఉజ్వల భవిష్యత్తు

 కళాశాల  విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్

0000000

     కాస్ట్ అకౌంటింగ్ శాతవాహన చాప్టర్ ప్రారంభోత్సవంతో ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయం లోని కళాశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు.

     మంగళవారం స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో వాణిజ్య రంగంలో ప్రతిష్ఠాత్మకమైన సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క శాతవాహన చాప్టర్ ని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్,  ఐసిఎంఏఐ సంస్థ జాతీయ అధ్యక్షులు  అయ్యర్ పి. రాజు  సంయుక్తంగా ప్రారంభించారు.  ఐసిఎంఏఐ తో కళాశాల విద్యాశాఖకు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఈ చాప్టర్ ని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల విద్యాశాఖ కమిషనర్  నవీన్ మిట్టల్  మాట్లాడుతూ “కాస్ట్ అకౌంటింగ్ శాతవాహన చాప్టర్ ప్రారంభోత్సవంతో  ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థులతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయం లోని కళాశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు  ఏర్పడుతుందన్నారు. ఈ విధంగా కళాశాల విద్యతో వృత్తిపరమైన కాస్ట్ అకౌంటెంట్ లను తయారు చేసే జాతీయ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సాఫ్ట్ వేర్ ఆధారిత వాణిజ్య రంగంలో  రాబోయే లక్షల ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి ఈ శాతవాహన చాప్టర్ గ్రామీణ విద్యార్థులకు శిక్షణనివ్వడానికి అందుబాటులో ఉంటుందన్నారు. కళాశాలలో బీకాం సిఎ కోర్సులతో సి.యమ్.ఎ – కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ని అనుసంధానం చేసుకోవాలని సూచించారు.  ఎస్సారార్ కళాశాల చరిత్రలో నేటి రోజు మైలురాయి లాంటిదని, ఇటీవలే కళాశాల స్వయం ప్రతిపత్తి సాధించినందుకు ప్రధానాచార్యులు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులను అభినందించారు.

     జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ కాస్ట్ అకౌంటింగ్ శాతవాహన చాప్టర్ ప్రారంభోత్సవం జిల్లాకు గర్వకారణమని  అన్నారు.

     అనంతరం మాట్లాడిన వక్తలందరూ కాస్ట్ అకౌంటింగ్ కోర్సు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

     కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐ సి ఎం ఏ ఐ జాతీయ అధ్యక్షులు శ్రీ అయ్యర్ పి రాజు , ఐ సి ఎం ఏ ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు ఏ వి ఎస్ ఎన్ మూర్తి , కళాశాల విద్యాశాఖ అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ టి చారి, శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వరప్రసాద్,

     ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ టి శ్రీ లక్ష్మీ , తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం  కార్యదర్శి డాక్టర్ సురేందర్ రెడ్డి, ఎస్.ఆర్.ఆర్ కళాశాల స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ బిక్షపతి, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి వరప్రసాద్, ఏ.నారాయణ, బి. సురేష్ కుమార్, డి.డి. నాయుడు మరియు ఎన్.సి.సి లెఫ్టినెంట్ పి. రాజు తదితర అధ్యాపక బృందం  పాల్గొన్నారు.

Share This Post