కిష్టారం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు చెరుకుపల్లి గ్రామంలో కల్పిస్తున్న పునరావాస ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు.

ప్రచురణార్ధం

నవంబరు 11, ఖమ్మం:

కిష్టారం ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు చెరుకుపల్లి గ్రామంలో కల్పిస్తున్న పునరావాస ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పరిశీలించారు. సత్తుపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన సుమారు 107 మందికి కిష్టారం ఓపెన్ కాస్ట్ పరిహారం కింద అందిస్తున్న పునరావాస ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా పునరావాసం పొందుతున్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా పునరావాస ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకోవాలని మౌళిక వసతుల కల్పనతో పాటు విద్య, వైద్య తదితర అన్ని వసతులను సమకూర్చడం జరుగుచున్నదని కలెక్టర్. తెలిపారు. పునరావాస ఏర్పాట్ల పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, సింగరేణి డి.జి. ఎం అంజనేయశెట్టి, ఏ.జి.ఎం. కృష్ణయ్య, తహశీల్దారు మీనన్, ఎం.పి.డి.ఓ సుభాషిణి, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఏ.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post