కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేరిట ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ పేరిట ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సదుపాయం కల్పించుటకు ఈ నెల 24 నుండి మే 1 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రమణారెడ్డి, నాబార్డు డి. డి. కృష్ణ తేజ లతో కలిసి బ్యాంకు అధికారులు, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, ఉద్యాన వన.శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ క్యాంపెయిన్ కు సంబంధించి వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ పి .ఏం. కిసాన్ లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయవలసినదిగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశించిందన్నారు. ఈ నెల 24 నుండి అన్ని బ్యాంకుల వారు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అట్టి శిబిరాలలో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖ, రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శులు, యెన్.ఎల్.ఆర్.ఏం. ప్రాజెక్ట్ బ్యాంకు అధికారులు లబ్దిదారులకు అవగాహన కల్పిస్తారని, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ల ద్వారా పి .ఏం. కిసాన్ లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించి వారం రోజులలోగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తారన్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎటువంటి బ్యాంక్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్ల వంటివి లేకుండా నేరుగా 3 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం లభిస్తుందన్నారు. లబ్ధిదారులు పి .ఏం. కిసాన్ పోర్టల్ ద్వారా/ సంబంధిత బ్యాంకు శాఖల నుండి కిసాన్ క్రెడిట్ కార్డులు పొందవచ్చని రాజర్షి సూచించారు.

ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని పీఎం కిసాన్ లబ్దిదారులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఉద్యాన శాఖ అధికారి సునీత, పశుసంవర్ధక శాఖ అధికారి వసంత కుమారి, మత్స్య శాఖ అధికారి సతీష్ కుమార్, ఎస్.బి.ఐ., యు.బి.ఐ., యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్, ఏ.పి .జి.వి.బి. , పి.ఎన్.బి., సెంట్రల్ బ్యాంక్, డి.సి.సి.బి. తదితర బ్యాంకుఅధికారులు పాల్గొన్నారు.

Share This Post