కీసర కలెక్టరేట్ను కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు కలెక్టరేట్, ఆవరణను పరిశీలించిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు

పత్రిక ప్రకటన

తేదీ : 07–05–2022

 

కీసర కలెక్టరేట్​ను కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలుకలెక్టరేట్, ఆవరణను పరిశీలించిన న్యాయమూర్తులు, జిల్లా అధికారులు

షామీర్​పేటలో నూతన కలెక్టరేట్​  ప్రారంభించగానే…కీసరలో ప్రస్తుత  కలెక్టరేట్​ను కోర్టుగా మార్చేందుకు పరిశీలించిన న్యాయమూర్తులు, అధికారుల బృందం

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ప్రస్తుతం ఉన్న జిల్లా సమీకృత కలెక్టరేట్​ సముదాయాన్ని  జిల్లా కోర్టుగా మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్​ భవనంతో పాటు ఆవరణను శనివారం సాయంత్రం ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ అండ్​ సెషన్స్​ జడ్జి  సి.హెచ్​.కె. భూపతి, ఫస్ట్​ అడిషనల్​ డిస్ట్రిక్ట్​ అండ్​ సెషన్స్​ జడ్జి ఆర్​. తిరుపతి, 16వ అడిషనల్​ డిస్ట్రిక్ట్​ జడ్జి బాలభాస్కర్​, జిల్లా బార్​ అసోసియేషన్​ సభ్యులు శ్రీధర్​లతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించారు.  మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్​ కార్యాలయ సముదాయం కీసరలో ఉండగా… అన్ని కార్యక్రమాలను అక్కడ నుంచే నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు షామీర్​పేటలో నూతనంగా అన్ని హంగులతో జిల్లా కలెక్టరేట్​కు సొంత భవనాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో  ప్రస్తుతం అక్కడకు కలెక్టరేట్​ మారనున్న నేపథ్యంలో కీసరలో కొనసాగుతున్న జిల్లా కలెక్టరేట్​ భవనాన్ని అద్దె చెల్లించి కోర్టుకు వినియోగించుకొనేందుకుగాను జడ్జిల బృందం  పరిశీలించగా … ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో ఉన్న వివరాలను జడ్జిలకు జిల్లా అధికారులు వివరించారు.  షామీర్​పేటలో నూతనంగా అన్ని జిల్లాల్లో మాదిరిగా నిర్మించినట్లుగానే మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్​ కార్యాలయ భవన నిర్మాణం అన్ని పనులు పూర్తయినందున అందులోకి త్వరలో మారే అవకాశం ఉంది. నూతన కలెక్టరేట్​ భవన సముదాయంలో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్నందున ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్​ సముదాయాన్ని అద్దె చెల్లించి  కోర్టుగా మార్చేందుకు ఈ భవనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Share This Post