కీసర హరిత వనము సందర్శించిన అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి హరితహారం మొక్కల పెంపకం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన స్పెషల్ చీఫ్ సెక్రెటరీ

అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది

కీసర హరిత వనము సందర్శించిన అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి

హరితహారం మొక్కల పెంపకం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ

అడవులను కాపాడి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఈ విషయంలో అందరూ సమన్వయంతో కృషి చేయాలని అటవీ శాఖ చీఫ్​ సెక్రెటరీ శాంతికుమారి అన్నారు.

బుధవారం మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసరలోని హరిత వనముని జిల్లా కలెక్టర్​ హరీశ్​తో కలిసి సందర్శించిన ఆమె మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్​  అడవుల సంరక్షణకు, చెట్ల పెంపకానికి ఎంతగానో ప్రాధాన్యతనిస్తోన్నారని  అందుకు గతంలో ఎప్పుడూ చేపట్టని విధంగా అడవుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కీసరలోని హరిత వనము పరిధిలో 1,248 ఎకరాలలో పార్కును అభివృద్ది చేస్తున్నామని  దీని పరిధిలో హరితహారం కింద 1.74 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.14 లక్షల మొక్కలు నాటడం జరిగిందని  మిగిలిన 60 వేల మొక్కలు ప్రస్తుతం నాటే పనులు కొనసాగుతున్నాయని వాటి పనులు కూడా వేగవంతం చేసి ప్రణాళికా బద్దంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే  మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని అటవీ శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ శాంతికుమారి వివరించారు. దీంతో పాటు కీసర ప్రాంతం హైదరాబాద్ నగరానికి చేరువలో ఉందని తెలిపినారు  ఈ ప్రాంతాన్ని హరితహారం కింద మొక్కలు నాటి చెట్లను పెంచి మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిచేందుకు కృషి చేస్తామని శాంతికుమారి స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా చీఫ్​ సెక్రెటరీ శాంతికుమారి, జిల్లా కలెక్టర్​ హరీశ్​తో కలిసి హరిత వనము మొత్తం కలియదిరిగారు. హరితహారం కింద చేపడుతున్న పనులు ఎంతో బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు కొనసాగాలని అన్నారు.  మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీశ్​ మాట్లాడుతూ  హరితహారం కింద అవసరమైన మొక్కలు నాటామని వాటి సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకొని సంరక్షిస్తున్నామని వివరించారు. ఈ విషయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకుగాను తాను ప్రత్యేక చొరవ చూపుతానని కలెక్టర్​ పేర్కొన్నారు. అనంతరము హరిత వనము లో  మొక్కలు నాటిన స్పెషల్​ చీఫ్​ సెక్రెటరీ శాంతికుమారి, జిల్లా కలెక్టర్​ హరీశ్​. అటవీ శాఖ చీఫ్​ కన్జర్వేటర్​ ఎం.జె. అక్బర్

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చీఫ్​ కన్జర్వేటర్​ ఎం.జె. అక్బర్​, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు,  డీఆర్​డీఏ పీడీ పద్మజారాణి, ఎంపీడీవో, తహశీల్దార్​, సర్పంచ్​, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.

Share This Post