కుటుంబ నియంత్రణ పై సమీక్షా సమావేశం

కుటుంబ నియంత్రణ పై సమీక్షా సమావేశం

*ప్రచురణార్థం-3*

జనగామ డిసెంబర్ 23:
కుటుంబ నియంత్రణ పై జిల్లాలో తీసుకుంటున్న చర్యల గురించి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ నియంత్రణ విభాగం అదనపు డైరక్టర్ డా.అమర్ సింగ్ నాయక్.
గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాయంలో ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులతో కుటుంబ నియంత్రణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ నియంత్రణ లక్ష్యాలు పూర్తి చేయాలని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు వెంటనే అందించాలని ఆయన అన్నారు.
*అనంతర జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ను మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలోని కుటుంబ నియంత్రణ పై తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు*
ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్,డా.శ్రీదేవి,డా.వెంకట్, డా.చాయదేవి, డా. భాస్కర్,తదితులున్నారు.

Share This Post