కుటుంబ సంక్షేమం కోసం నియంత్రణ తప్పనిసరి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో తాత్కాలిక, శాశ్వత పద్దతులలో కుటుంబ నియంత్రణ ఎంతో దోహద పడుతుందని, ఆర్థికంగా, ఆరోగ్యంగా అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కుమ్రo బాలుతో కలిసి కుటుంబ నియంత్రణలో వ్యాసక్టమీ పక్షోత్సవాలులో భాగంగా సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా మొదటి విడతలో ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలలో ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడీ కార్యక్రమాలు, సూపర్‌వైజర్లకు అవగాహన కల్పించాలని, అన్ని ప్రధాన కేంద్రాలు, కూడళ్ళలలో ప్రజలకు తెలిసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రెండవ విడతలో ఈ నెల 28 నుండి డిసెంబర్‌ 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, జిల్లాలో ఇప్పటి వరకు 1 వేయి 502 మందికి కుటుంబ నియంత్రణ చేయడం జరిగిందని, డిసెంబర్‌ 5వ తేదీ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ట్యూబెక్టమీ శస్త్రచికిత్సలు చేసే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, సిబ్బందికి నిర్ధిశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారి సుబ్బారాయుడు, వైద్యాధికారులు డా॥ ఫయాజ్‌, ఇంద్రావతి సంబంధిత
శాఖల అధికారుల తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post