కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి…….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి…….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

దంతాలపల్లి,
మహబూబాబాద్ జిల్లా – జూలై, 23:

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు, అధికారులు అప్రమత్తమై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు పకడ్బంది ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం తో కలిసి దంతాలపల్లి మండలం పెద్దముప్పారం – తూర్పు తండ మధ్య ఓవర్ ఫ్లో తో పారుతున్న పాలేరు వాగును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో శుక్రవారం ఒక్కరోజుల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైన మండలంగా దంతాలపల్లి ఉందని, చెరువులు కుంటలు మత్తల్లు పడ్డాయని, వాగులు, కాలువలు ఉధృతంగా, అధికవేగంగా ప్రవహిస్తున్న దృష్ట్యా ప్రజలు చుట్టుప్రక్కల కు వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని, చేపల వేటకు, ఈతలకు, చూసేందుకు అసలు వెళ్లరాదని, అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు వెళ్లకూడదని, జంతువులను పాకల్లోనే కట్టేసి మేపుకోవాలని, గోడలు నిమ్ము రావడం, బట్టలు అరవేసుకునే సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరం మేరకు ఇసుక నింపుకొని బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.

వాహనదారులు ప్రయాణించే సమయంలో వరద తీవ్రత కు రోడ్లు కోతకు గురై గుంతలు ఏర్పడటంవల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నదని, వరద తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గేవరకు గ్రామ పంచాయతీ సిబ్బంది తో హెచ్చరిక బోర్డులను, బారికేడ్లను, ముళ్ల కంపలతో రవాణా నిలిపివేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్శనలో ఆర్ డి ఓ ఎల్. రమేష్ ,తహసిల్దార్ కే కిషోర్ కుమార్, ఎంపీడీవో డి గోవిందరావు, ఇరిగేషన్ ఈ ఈ లు వెంకటేశ్వర్లు, సుదర్శన్ రావు మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post