కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు అన్నారు.

గురువారం నాడు హన్మకొండ జిల్లా హసన్ పర్తి లోని పెద్ద చెరువులో మత్స్య శాఖ ద్వారా పంపిణీ చేసిన చేప పిల్లలను మంత్రి విడుదల చేసారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా అయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఎర్పడిన నాటి నుండి ఏడు సంవత్సరాలలో అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాదించామన్నారు. పూర్వం నీళ్ళు కరెంట్ గురించి ఎంతో ఇబ్బందిగా ఉండేదని ప్రస్తుతం, రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యత్తు అందిస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో మత్స్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. కానీ ఇప్పుడు మత్య్సకారుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని మంత్రి తెలిపారు.
మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మత్స్య సంపదను రక్షించుకుని మత్స్యకారులు అభివృద్ధి చెందాలని.. తక్కువ ధరకు చేపలు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు.చేపలను పట్టుకునే హక్కు ముదిరాజ్, గంగా పుత్ర కులాల వారికి కల్పించామని ఆయన అన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ వృత్తుల అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించారని, అందులో భాగంగానే కుంచించుకుపోయిన చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.అభివృద్ధి చేసిన చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతూ మత్స సంపదను సృష్టిస్తూ, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.

వర్దన్నపేట
శాసన సభ్యులు అరురి రమేష్ మాట్లాడుతూ మత్స్యకారులు అన్ని రంగాల్లో ఎదగడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేప పిల్లల పంపిణీ, ప్రగతి ని వివరించారు.

ఈ సమావేశంలో డీఆర్వో వాసుచంద్ర,పలువురు ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post