కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు

కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్న జంట లకు కలెక్టర్ చేతుల మీదుగా రూ. 2,50,000 చెక్కులను అందజేశారు. ఐజ మండల కేంద్రానికి చెందిన చింతచెట్టు ప్రసాద్ (ఎస్సీ) స్వప్న (ఎస్టీ) ఐజ మండలం కులాంతర వివాహం చేసుకున్నందున వారికి చెక్కును అందజేశారు. అదేవిదంగా గద్వాల పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన మర్యాద ప్రదీప్ రెడ్డి (ఓసి) శ్రీదేవి (ఎస్సి)కులానికి చెందిన వారు వివాహం చేసుకోగా వారికి కూడా చెక్కును అందజేశారు..జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్వేతా ప్రియదర్శిని, సరోజ  తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే  జారీ చేయబడినది.

Share This Post