కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి…

ప్రచురణార్థం

కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి…

మహబూబాబాద్ నవంబర్ 18.

గ్రామాలలో అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద కూలీ పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

పట్టణంలోని ఐ ఎం ఏ హాల్లో మండల స్థాయి అధికారులకు ఉపాధి హామీ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

సమాన పనికి సమాన వేతనంగా ఆడామగా తేడా లేకుండా వేతనం చెల్లించాలన్నారు.

వేతనాలు చెల్లింపులలో పదిహేను రోజుల కన్నా మించరాదన్నారు.

కూలీలకు పనులు కల్పించాలని అడిగితే తప్పనిసరిగా వంద రోజులు పనులు చూపించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.

గ్రూపులు ఏర్పాటు చేసి మేనేజర్లను నియమించి మ్యాపింగ్ ద్వారా పనులు చేపట్టాలన్నారు.

ఉపాధి హామీ పనులకు డిమాండ్ ఉందని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు గత సంవత్సరంలో లక్ష్యాలను సాధించిన అధికారులందరినీ కలెక్టర్ ప్రశంసించారు.

ఉపాధి హామీ పథకం అమలు లో భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు.

ఉపాధి హామీ పథకంలో పనులెన్ని చేస్తే అంత బడ్జెట్ రాబట్టుకోవచ్చు అని కలెక్టర్ తెలియజేశారు.

ఉపాధి హామీ పనులు ప్రారంభించేందుకు తగిన సమయ మన్నారు.

కాలువల పూడికతీత పనులు ఫిష్ పాంట్స్ ఫ్రెంచ్ కటింగ్స్ పనులను చేపట్టాలన్నారు గ్రామస్థాయి పనులకు ముందుగా అనుమతులు పొందాలన్నారు మండల స్థాయిలో అవగాహన తో పనులు చేపట్టాలని కలెక్టర్ తెలియజేశారు.

ఉపాధి హామీ పథకం నిర్వహణ పనులకు రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రతి ఒకటి నమోదు చేయాలన్నారు ఇది నిరంతర ప్రక్రియగా భావించాలని ప్రతి నెల సమీక్షలు కూడా జరపాలన్నారు.

పనులు చేపట్టడంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని నూతనంగా ఆలోచిస్తూ ఫలితాలు రాబట్టాలని అన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సన్యా సయ్య, ఎంపీడీవోలు ఏపీవో లు టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post