కూలీలకు సకాలంలో నిధులు చెల్లించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్థం

కూలీలకు సకాలంలో నిధులు చెల్లించాలి…

మహబూబాబాద్ ఆగస్టు 3.

ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నిధులు చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హరితహారం బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉపాధి హామీ స్మశాన వాటికల కు బయో పెన్సింగ్ కోవిద్ 19 తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్ పై ప్రధాన దృష్టి పెట్టాలన్నారు అవెన్యూ ప్లాంటేషన్ కు తప్పనిసరిగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని అవి అందంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

హరిత హారంలో చేపట్టిన పనులకు నిధులు తక్షణం మంజూరు చేయాలన్నారు ఉపాధి హామీ పనులకు కూలీలు ఆసక్తి చూపే లా అధికారులు కృషి చేయాలన్నారు.

స్మశాన వాటిక లకు తప్పనిసరిగా బయో పెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు అదే విధంగా పెండింగ్లో ఉన్న స్మశానవాటిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో నీటి నిల్వలపై దృష్టి పెట్టాలని ఆయిల్ బాల్స్ వేయించాలని సూచించారు అదేవిధంగా పారిశుద్ధ్యం చేపట్టి బ్లీచింగ్ చల్లించాలన్నారు.

గ్రామ పంచాయతీ లలో ఫాగింగ్ చేపట్టాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో మందులు నిల్వ ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.

Covid పనితీరుపై సమీక్షిస్తూ మాస్క్ పై ఫోకస్ పెట్టాలని వ్యాక్సినేషన్ పెంచాలని అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో అప్పారావు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య పంచాయతీ అధికారి రఘువరన్ తదితరులు పాల్గొన్నారు
—————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post