కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ జలాలను పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డితో కలసి జిల్లా కలెక్టరు వి.పి. గౌతమ్ విడుదల చేశారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 05 ఖమ్మం:

రైతులు సాగునీటిని సద్వినియోగపర్చుకొని పొదుపుగా నీటిని వాడుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ జలాలను పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డితో కలసి జిల్లా కలెక్టరు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఖరీఫ్ పంటల సాగుకోసం ఆరువందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని సాగర్ జలాలు మరో రెండురోజుల్లో రిజర్వాయరుకు చేరుకుంటాయని అప్పుడు నాలుగు వేల క్యూసెక్కులకు నీటి విడుదల పెంచుతామన్నారు. నీటి ఆవశ్యకతననుసరించి ఆయా పంటలు సాగుచేసి రైతాంగం ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.

పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. యాభైవేల లోపు ఋణాలు పొందిన రైతులకు రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పాలేరు జలాశయం క్రింద రెండు లక్షల ఎకరాలు సాగవుతుందని రైతులందరు సకాలంలో పంటలు వేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు.

ఇర్రిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరు శంకర్నాయక్, ఇ.ఇ సమ్మిరెడ్డి, తిరుమలాయపాలెం, కూసుమంచి డి. ఇలు రమేష్ రెడ్డి, రత్నకుమారి, తిరుమలాయపాలెం, కూసుమంచి ఎం.పి.పిలు మంగీలాల్, శ్రీనివాస్, మద్దుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ యం. వెంకన్న, ఎం.పి డి.ఓ కరుణాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post