*కెటికె ఓపెన్ కాస్ట్-III ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*కెటికె ఓపెన్ కాస్ట్-III ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*ప్రచురణార్థం-1*

*కెటికె ఓపెన్ కాస్ట్-III ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

జయశంకర్ భూపాలపల్లి, మే 7: కెటికె ఓపెన్ కాస్ట్-III ప్రాజెక్టు కొరకు సింగరేణి ప్రతిపాదించిన భూసేకరణకు చర్యలు వేగవంతం చేసి, వచ్చే జూన్ నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో భూసేకరణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘణపూర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో రెండుచోట్ల 508, 312 ఎకరాల భూసేకరణ జరుగుతున్నట్లు తెలిపారు. 512 ఎకరాల్లో 230 ఎకరాల సేకరణ పూర్తయినట్లు, 80 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఆయన అన్నారు. మిగులు భూ సేకరణలో సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సేకరణ చేయాల్సిన భూమిలో ప్రతి సర్వే నెంబర్ క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. కాగా 312 ఎకరాల భూ సేకరణకు గాను క్షేత్ర చర్యలు పూర్తయినట్లు, రికార్డు పనులు వెంటనే పూర్తి చేసి, సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, వ్యక్తిగత శ్రద్ధ తో త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రక్రియ పూర్తికి అన్ని విధాలా సహకారం ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. భూ సర్వేకి కావాల్సిన ల్యాప్ టాప్ లు ఇవ్వనున్నట్లు, సిబ్బంది, ఇతర పరికరాల సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. స్వర్ణలత, భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎడి సర్వే & ల్యాండ్ రికార్డ్స్ ఆర్. సుదర్శన్, సింగరేణి సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పి. కార్తిక్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మురళీధర్ రావు, తహశీల్దార్లు ఎండి. ఎక్బాల్, ఎస్. సతీష్ కుమార్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post