కెసిఆర్ కిట్ లు, ఇమ్యునైజేషన్, టీబీ, ఆర్ బి ఎస్ కె, వ్యాక్సినేషన్, రక్తహీనత తదితర అంశాలపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:27.04.2022, వనపర్తి.

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి, వైద్య సేవలు అందించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
బుధవారం ఐ డి ఓ సి. వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కెసిఆర్ కిట్ లు, ఇమ్యునైజేషన్, టీబీ, ఆర్ బి ఎస్ కె, వ్యాక్సినేషన్, రక్తహీనత నియంత్రణ తదితర అంశాలపై ఆమె వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలను గుర్తించి, ఇంటింటికీ వెళ్లి వారికి అందించాల్సిన మందులను సకాలంలో అందించాలని ఆమె సూచించారు. వైద్య సేవలు అందించడంలో జిల్లా ముందంజలో ఉందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ రవిశంకర్, డిప్యూటీ డి ఎం హెచ్ వో శ్రీనివాసులు, ప్రోగ్రామింగ్ అధికారి ఇస్మాయిల్, రామ్ చందర్, సాయినాథ్ రెడ్డి, సౌభాగ్య లక్ష్మి,, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post