కేంద్రం ద్వారా అమలు అవుతున్న పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నేషనల్ మానిటరింగ్ టీమ్ ను కోరారు.

పత్రికా ప్రకటన                                                                తేది :29- 9- 2021

కేంద్రం ద్వారా అమలు అవుతున్న పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నేషనల్ మానిటరింగ్ టీమ్ ను కోరారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు భారత ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వ శాఖ తరపున   నేషనల్ మానిటరింగ్ టీమ్ యాజమాన్య అభివృద్ధి కేంద్రం, కేరళ స్టేట్  వారి ఆధ్వర్యంలో  నేటి నుండి 8రోజులపాటు జిల్లాలో సందర్శించనున్నామని,  కలెక్టర్ కి తెలిపారు.  ఉపాధిహామీ, దీన దయాళ్ అంతోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. మరియు , జాతీయ సాంఘిక సహాయక పథకం ( పింఛన్లు) వంటి  కేంద్ర ప్రభుత్వం పథకాల యొక్క   అమలు, విది విదనాలను   పరిశీలిస్తామని   తెలిపారు. ఈ రోజు నుండి 8 వ తేదీ వరకు సందర్శన ఉంటుందని , జిల్లా లోని   గద్వాల,  ఐజ, మానవపాడు మండలాలలో 10 గ్రామాల ను సందర్శిస్తామని తెలిపారు.

టీం లో సనేష్కుమర్ ఎంకే,  సిరిన్ , బృందం  లైసోనింగ్ అధికారి భి . వెంకటయ్య , జిల్లా ట్రైనింగ్ మేనేజర్ , కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారని తెలిపారు.

సమావేశం లో   అదనపు కలెక్టర్  శ్రీహర్ష  , డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, అదనపు డిఅర్ డి ఎ నాగేంద్ర , తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

Share This Post