కేంద్రం పరిధిలోని అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 18, 2021ఆదిలాబాదు:-

వ్యాక్సినేషన్ కేంద్రం పరిధిలోని అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించాలని, అందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక వినాయక్ చౌక్ లోని శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వ్యాక్సిన్ కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి టీకా మందు పంపిణి జరిగింది అనే వివరాలను, కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం లో అర్హులైన 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా మందు పంపిణి జరగాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి రెండవ డోస్ ఎన్ని రోజుల్లో తీసుకోవాలో తెలియజేయాలని, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నట్లయితే వైద్యులు సూచించిన మేరకు మాత్రలు తీసుకునే విధంగా తెలియజేయాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య విభాగం కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి సమస్యను తెలిపి పరిష్కరించుకునేవిధంగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.

Share This Post