కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ సభ్యులు ఎం. కె.సనిష్ కుమార్, ప్రాజెక్టు అధికారి, నిసి జాన్, రీసెర్చ్ అసోసియేట్ లతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన వనపర్తి తేదీ:20.9.2021.

కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ మానిటరింగ్ సభ్యులు వనపర్తి జిల్లాలో పర్యటించి, పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ మానిటరింగ్ సభ్యులు ఎం. కె.సనిష్ కుమార్, ప్రాజెక్టు అధికారి, నిసి జాన్, రీసెర్చ్ అసోసియేట్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ బృందం సభ్యులు వనపర్తి, పెబ్బేరు, పెద్దమందడి మండలాల్లో చేపట్టిన 18 గ్రామా పంచాయతీలను ఎంపిక చేసి, పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం మోజర్ల గ్రామ పంచాయితీ, పెద్ద మంద డి మండలంలో వారు పర్యటించి, అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్న ట్లూ జిల్లా కలెక్టర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( MGNREGS), నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (NRLM), వాటర్ షెడ్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం, పీఎం కిసాన్ యోజన పథకం, రెవెన్యూ రికార్డుల డిజిట లీకరణ, కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, లోకల్ బాడీ అంకిత్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్, Adl.di. ఆర్.డి. ఓ.కుమార్, ఈ. పి.ఆర్, డి ఈ ఓ, డి.పీ వోలు, ఏ పీ ఓ లు, సెర్ఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post