కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ మానిటరింగ్ సభ్యులతో ముగింపు సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన వనపర్తి తేదీ:27.9.2021.

కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ మానిటరింగ్ సభ్యులు వనపర్తి జిల్లాలో పర్యటించి, పర్యవేక్షించారని తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ మానిటరింగ్ సభ్యులు ఎం. కె.సనిష్ కుమార్, ప్రాజెక్టు అధికారి, నిసి జాన్, రీసెర్చ్ అసోసియేట్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ఎగ్జిట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం ఈ నెల 20 నుండి 27వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి పథకాలను పరిశీలించి సంతృప్తి చెందినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి, మంత్రిత్వ శాఖ బృందం సభ్యులు వనపర్తి, పెబ్బేరు, పెద్దమందడి, శ్రీరంగాపురం మండలాల్లో చేపట్టిన 10 గ్రామ పంచాయతీలను వారు పర్యవేక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సూచించారు.
కేంద్ర బృందం అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ( MGNREGS), నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (NRLM), వాటర్ షెడ్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం, పీఎం కిసాన్ యోజన పథకం, రెవెన్యూ రికార్డుల డిజిట లీకరణ, కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలను వారు అడిగి తెలుసుకునీ, తగు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్, కేంద్ర బృందం వారి సూచనలను పాటిస్తూ ముందుకు వెళ్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, లోకల్ బాడీ అంకిత్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు, డి పి ఓ సురేష్, Adl. డి. ఆర్.డి. ఓ. కృష్ణయ్య, డీఈవో రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post