కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయితీ లకు రావాల్సిన వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ* *పంచాయితీలకు రావాల్సిన బకాయిలను* *వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి*

– పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పరిశుభ్రత పెరిగింది, సీజనల్ వ్యాధులు తగ్గాయి.

-సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ది.

– జిల్లాలోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా ఎదగాలి

-పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

-జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
—————————-
సిరిసిల్ల 04, ,జూన్ 2022:
——————————

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయితీలకు రావాల్సిన బకాయిలను వెంటనే కేంద్ర ప్రభుత్వo విడుదల చేయాలని
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల తో కలిసి కోనారావు పేట మండలం కనగర్తి, నిమ్మపల్లి, బావుసాయి పేట , చందుర్తి మండలం రామా రావు పల్లె, మూడపల్లి గ్రామాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా రెండో రోజు కంపోస్టు షెడ్ లు,డంపింగ్ యార్డ్ లు, పల్లె ప్రకృతి వనాలను నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో చైర్ పర్సన్, కలెక్టర్‌ పరిశీలించారు.

 

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి మాట్లాడుతూ….
జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి ఈ నెల 18 వ తేదీ వరకూ 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తునట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల అభివృద్ధి కి దూరంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు.

తెలంగాణ వస్తే ఏం వస్తుంది అనే వ్యక్తులకు చెప్పండి….. పల్లెలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పరిశుభ్రత పెరిగింది, సీజనల్ వ్యాధులు తగ్గాయని అన్నారు.

పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. స్వరాష్ట్రo లో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయి, అంగన్వాడి సేవలు మెరుగయ్యాని చైర్పర్సన్ తెలిపారు.

*కంపోస్టు షెడ్ లు,డంపింగ్ యార్డ్ లు, పల్లె ప్రకృతి వనాలను నూరుశాతం వినియోగంలోకి తేవాలి*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ…..
జిల్లాలోని కంపోస్టు షెడ్ లు,డంపింగ్ యార్డ్ లు, పల్లె ప్రకృతి వనాలను నూరుశాతం వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి  అధికారులను ఆదేశించారు

గ్రామాలలో పల్లె ప్రగతి పనులన్ని వందశాతం సక్రమంగా నిర్వహించాలని, పారిశుధ్యం పనులు నిరంతరాయంగా జరగాలని, పచ్చదనం పెంపొందించేందుకు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పల్లెలన్నీంటిని పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా చేసుకోవాలని అన్నారు.

తెలంగాణ హరితహారం కార్యక్రమం లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ బాగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలను రోడ్లకు ఇరువైపులా నాటాలని కలెక్టర్ సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు .

గ్రామాల్లో ప్రమాదకరమైన బోరు బావులు, ఓపెన్ బావులను పూడ్చి వేయాలన్నారు. శిథిలావస్థలో చేరిన కట్టడాలను కూల్చివేయాలని అన్నారు.

జిల్లాలోని అన్ని తెలంగాణ క్రీడా ప్రగతి ప్రాంగణాలు 15 రోజుల్లో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సానిటేషన్ కోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని సూచించారు. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఈగలు వృద్ధిచెంది ప్రజలు కీటక జనిత వ్యాధుల బారినపడే అవకాశం ఉన్నందున ఒక్క నీటి బొట్టు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోనీ పాఠశాలల్లో మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రక్తహీనత కేసులు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ , ICDS అధికారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.

సిజేరియన్ ప్రసవాల వల్ల స్వీయ నష్టం ఎక్కువనే విషయం గుర్తెరగాలి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు కే ప్రతి ఒక్కరు ముగ్గు చూపాలన్నారు . మొదటి కాన్పు తప్పనిసరిగా సాధారణ ప్రసవం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ – హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందనీ , సర్వే ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ హెల్త్ కార్డుల వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉచిత మందులు, వైద్యసేవలు అందించే ఆస్కారం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి చేయని గ్రామ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పవర్ డే ద్వారా విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

—————————-
* కనగర్తి, బావుసాయిపేట, రామారావు పల్లె లలో తెలంగాణ క్రీడా* *ప్రాంగణంను ప్రారంభించిన జిల్లా ప్రజా* *పరిషత్ చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్*

—————————-
పల్లె ప్రగతి క్షేత్ర సందర్శన లో భాగంగా శనివారం కనగర్తి, బావుసాయిపేట, రామారావు పల్లె గ్రామాల్లో క్రీడా ప్రాంగనాలను జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్ లు ప్రారంభించారు.

క్రీడారంగంలో యువతను ప్రొత్సహించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చన్న ఆలోచనతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మదన్ మోహన్, స్థానిక ఎంపీపీ, జడ్పిటిసి, స్థానిక ప్రజా ప్రతినిధులు ,మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.
——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post