కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనిర్వహించే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, మణిపూర్ లో 2020-21 సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో

కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, మణిపూర్ లో 2020-21 సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా యువజన,క్రీడల అధికారి ఆర్.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులుగా బ్యాచిలర్ అఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ (B.Sc., Sc) , బాచిలర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్( B.P.E.S.) నందు ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన మాస్టర్ అఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, మాస్టర్ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా ఆయన సూచించారు. పూర్తి వివరాలకు www.nsu.ac.in వెబ్ సైట్ నందు పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 19 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష, ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్, వైవా వాయిస్ టెస్ట్, ఉంటుందని, అలాగే క్రీడా విజయాలలో కనబరచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారని నాగరాజు పేర్కొన్నారు.

Share This Post