కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను విజయవంతం చేసేందుకు అధికారులు, శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమాజానికి ఒక దీక్సుచిగా నిలవటమే దిశ సమావేశ లక్ష్యం – పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను విజయవంతం చేసేందుకు అధికారులు, శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ సమాజానికి ఒక దీక్సుచిగా నిలవటమే దిశ సమావేశం లక్ష్యమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు అన్నారు. సోమవారం ఉదయం శుభమస్తు ఫంక్షన్ హాల్లొ నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్యాయం మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి పార్లమెంట్ సబ్యులు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమన్వయం లేకుండా ఏ పని సాధ్యం కాదని అందుకే జిల్లా అభివృద్ధి సాధించాలంటే అధికారులు, ఆయా శాఖలు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఆభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్దిదారులకు అందే విధంగా చూడాలన్నారు. వెనుకబడిన నాగర్ కర్నూల్ జిల్లాను అభివృద్ధి పరచడంలో అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. ప్రతి 3 నెలలకోసారి నిర్వహించాల్సిన దిశ సమావేశం కరోనా కారణంగా ఆలస్యమయ్యిందని, ఇకమీదట ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాల ద్వారా ప్రవేశ పెడుతున్న పథకాలపై ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పంచాయతి రాజ్, ఇరిగేషన్, మౌళిక సదుపాయాలు, జడ్పి, ఇఇ పి.ఆర్, గనులు భూగర్భ శాఖ,విద్యుత్, ఉపాధి, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అమలు పరుస్తున్న ఆభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ శాఖ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్, జాతీయ ఆహార భద్రత మిషన్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య శాఖ సమీక్ష సందర్బంగా మాట్లాడుతూ డాక్టర్లు తమ వృత్తి ధర్మానికి న్యాయం చేయాలని, వచ్చిన రోగులకు ఆప్యాయతగా మాట్లాడి తగిన వైద్యం అందించి తమ వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. ఇర్రిగేషన్ పై మాట్లాడుతూ భూసేకరణ చాలా ఆలస్యమవుతుందని త్వరగా పూర్తి అయ్యేవిధంగా చూడాలన్నారు. పంచాయతి రాజ్ శాఖ సమీక్ష సందర్బంగా ఆయన మాట్లాడుతూ లే అవుట్లలో కేటాయించిన 10 శాతం ప్రభుత్వ భూమిని తిరిగి అమ్ముకుంటున్నారని అలాంటి వాటి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని డి.పి.ఓ ను ప్రశ్నించారు. జిల్లాలో మొత్తం ఏన్నీ లే అవుట్లు ఇచ్చారు, వాటిలో 10 శాతం భూమి ఎంతవరకు జి.పి స్వాదింలో ఉంది అనే పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు. పరిశ్రమలు, ఉపాధి కల్పన శాఖల పై మాట్లాడుతూ పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలో అవగాహన, నైపుణ్య శిక్షణ, జాబ్ మేళాలు ఏర్పాటు చేసి అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పే విధంగా చూడాలని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఎం.ఎస్.ఏమ్.ఈ. రుణాలు పరిశ్రమలు పెట్టదలచుకున్న వారందరికి లభించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మైన్స్ శాఖ పై మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అవసరమైన వారందరికీ సులువుగా లభించేవిధంగా చూడాలని మైన్స్ అధికారిని ఆదేశించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కల్పించుకుంటు జిల్లాలో ఇసుక రెండు విధాలుగా దొరుకుంతుందన్నారు. ఒకటి టి.ఎస్. ఎం.డి.సి ద్వారా ప్రభుత్వ పనులకు, రెండవది మన ఇసుక వాహనం ద్వార ప్రజలకు దొరుకుతుందన్నారు. ఇప్పటి వరకు మన ఇసుక వాహనం ద్వారా దరఖాస్తు చేసుకున్న 3500 యూనిట్లు ఇవ్వడం జరిగిందని మరో 200 యూనిట్లు పెండింగ్ లో ఉందన్నారు. ఈ రెండు విధానాలు కాకుండా ఎవరైనా అక్రమంగ ఇసుక తరలిస్తే పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంద న్నారు. గిరివికాసం కింద ఇద్దరు ముగ్గురు గిరిజన రైతులు 5 ఎకరాల భూమితో ఒక క్లస్టరుగా ఏర్పడితే ఉచితంగా బోర్ వేయించడం, మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. దినికి ఎలాంటి పరిమితులు లేవన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ చేరువులపై ఎవరికి నియంత్రణ లేకుండా పోయిందని తద్వారా నింపిన నీళ్లు వృధాగా తూముల ద్వారా వదిలేయడం జరుగుతుందన్నారు. తద్వారా పొలాలు జమ్మూపడుతూ కొంతవరకు వ్యవసాయ పొలాలు పాడవుతున్నాయన్నారు. నియంత్రణ చాలా ముఖ్యమని ఇరిగేషన్ శాఖ అధికారులను సూచించారు.
కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎలమ సత్యం మాట్లాడుతూ అంగన్వాడీ పోస్టులకు మౌఖిక పరీక్షలు నిర్వహించినప్పటికిని అర్హులకు కాకుండా అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. కాల్వకుర్తిలో బ్లడ్ స్టోరేజ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నారు.
అచ్ఛంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్ మాట్లాడుతూ పి.హెచ్.సీల్లో గర్భిణిలకు సరైన వైద్యం అందక నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తే ఇక్కడ కూడా సరైన వైద్యం కల్పించక ప్రయివేట్ కు గాని మహబూబ్ నగర్ కు పంపిస్తున్నారని ఆరోపించారు. వైద్య సిబ్బంది రోగులకు కసురుకోవడం నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ విధానం మారాలని కమిటీ దృష్టుకి తెచ్చారు. ఇదేవిషయాన్ని తెల్కపల్లి ఎంపిపి మధు సైతం లేవనెత్తారు.
బలమూర్ ఎంపిపి అరుణ మాట్లాడుతూ అంగన్వాడీల్లో 60 సవత్సరాల వయస్సు దాటిన టీచర్లు ఆయాలు సైతం అలాగే విధులు నిర్వహిస్తున్నారని వారికీ చేతకావడం లేదని మొరబెట్టుకున్న పదవి విరమణ చేయించి కొత్త వారికి అవకాశం ఇవ్వడం లేదని ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు.
అమ్రాబాద్ ఎంపిపి, కల్వకుర్తి ఎంపిపి, కల్వకుర్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్ సైతం పలు సమస్యలు కమిటి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశంలో స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అదనపు కలెక్టర్ మను చౌదరి, పి.డి డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, జిల్లా అధికారులు, ఎంపీపీ లు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post