*కేజీబీవీ పాఠశాలల్లో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*

*కేజీబీవీ పాఠశాలల్లో ప్రగతిలో ఉన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, జనవరి 03: విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ప్రగతిలో ఉన్న పలు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ (విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులతో కలిసి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండెపల్లిలో నిర్మిస్తున్న వృద్ధాశ్రమం, సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్ లో నిర్మిస్తున్న అంబేద్కర్ భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలన్నింటినీ తనిఖీ చేసి వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపై ఉమ్మడి నివేదిక సమర్పించాలని, వాటికి సంబంధించిన ఫోటోలను జత చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ వి. విరూపాక్ష, జిల్లా స్త్రీ-శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఎస్సీ సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి, డీఈ సమ్మిరెడ్డి, సైట్ ఇంజనీర్లు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post