కేడీసీసీ బ్యాంకు సిరిసిల్ల బ్రాంచ్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల, నవంబర్ 6: సిరిసిల్లలో నిర్మించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబి) సిరిసిల్ల బ్రాంచ్ నూతన భవనాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కె. తారకరామారావు శనివారం ప్రారంభించారు. 1 కోటి 79 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మేనేజర్ ఛాంబర్, లాకర్, తదితర గదులను మంత్రి పరిశీలించారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ ఎన్.అరుణ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ బికే. రాహుల్ హెగ్డే, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, బ్యాంకు సీఈఓ సత్యనారాయణ రావు, డీసీఓ బుద్ధనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post